నవీనము

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో-రచన: అన్నమాచార్య రాగం: బేహాగ్ తాళం: ఆదితాళం



రచన: అన్నమాచార్య

రాగం: బేహాగ్
తాళం: ఆదితాళం

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ||

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ |
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో ||

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ |
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో ||

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప |
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో ||
 
                                     

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy