నవీనము

18, ఫిబ్రవరి 2016, గురువారం

నేను అడిగింది చెబితేనే, నిన్ను లోపలకి వెళ్ళనిస్తా.



ఒకానొక శుభ దినాన మన చలపాయ్ చచ్చిపోయి, స్వర్గానికి వెళ్ళాడు.
అక్కడ తలుపు దగ్గిర చిత్రగుప్తుడు నుంచొని ఉన్నాడు..
.
చిత్రగుప్తుడు: అబ్బాయ్, ఇక్కడ దాకా ఐతే వచ్చావ్ కానీ, నేను అడిగింది చెబితేనే, నిన్ను లోపలకి వెళ్ళనిస్తా...
.
చలపాయ్: సరే సార్...
.
చిత్రగుప్తుడు: లవ్ స్పెల్లింగ్ ఏంటి?
.
చలపాయ్: L..o..v.. e...
.
చిత్రగుప్తుడు: వెరీ గుడ్.. ఇహ నువ్వు లోపలకి రావచ్చు...
.
(ఇంతలో చిత్రగుప్తుడి మొబైల్ రింగ్ అయ్యింది)
.
చిత్రగుప్తుడు: అబ్బాయ్, నన్ను ఇంద్రుల వారు పిలుస్తున్నారు. కసేపు ఇక్కడ కాపలా ఉండు...
.
(మనోడు సరే అని ఒప్పుకుని, ఆ తలుపు ముందు అటూ, ఇటూ తిరుగుతున్నాడు..
ఇంతలో అక్కడకి కాంతం వచ్చింది)
.
చలపాయ్: నీకేమైందే కాంత? ఇలా ఎందుకు వచ్చావ్?
.
కాంతం: మిమ్మల్ని తగలబెట్టి వస్తుంటే, ఎదురుగా ఒక బస్సు వచ్చి నన్ను గుద్దింది. తెలివి వచ్చేసరికి ఇక్కడ ఉన్నా కానీ, అడ్డు లే.... లోపలకి వెళ్ళాలి..
.
చలపాయ్: నేనొప్పుకోను. ఇక్కడ నేను డ్యూటీ లో ఉన్నా.. ఒక పదానికి స్పెల్లింగ్ చెబితేనే ఎవర్నైనా లోపలకి పంపమని చెప్పారు చిత్రగుప్తుడు..
.
కాంతం: ఎంటో ఆ పదం?
.
.
.
చలపాయ్: చకోస్లేవేకియా........

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy