నవీనము

4, ఫిబ్రవరి 2016, గురువారం

ఏ పనైనా మనసు పెట్టి చేయాలి-చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు



చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువకాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.


భావం: మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాన్నిస్తుంది. మనసు దానిమీద లీకపోతే అది ఫలించదు. మఱ్ఱి చెట్టు విత్తనము ఎంతో చిన్నదైనా ఎంతో పెద్ద చెట్టై విస్తరిస్తుంది.

నీతి: ఏ పనైనా మనసు పెట్టి చేయాలి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy