నవీనము

4, ఫిబ్రవరి 2016, గురువారం

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ | కూడున్నది పతి చూడి కుడుత నాంచారి -రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు |
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||

కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ||

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy