ఉ. లోకమున దుర్జనులలోఁతు నెఱుంగక చేరరాదు సు
.శ్లోకుఁడు చేరినం గవయఁ జూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోటగుమిగూడి యసహ్యపుఁగూఁతలార్పుచుం
గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడ మంద భాస్కరా.
భావం - కాకులెక్కడైనా కోకిలను చూసినప్పుడు గుంపులుగా వచ్చి తరిమినట్టుగా లోకంలో దుర్మార్గుల స్వభావమును తెలుసుకొనక, మంచి వాడు వాళ్ళ దగ్గర చేరగూడదు. అలా చేరితే, వాడి మీద పడి కొట్టడానికి చూస్తారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి