నవీనము

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము || రచన: అన్నమాచార్య




రచన: అన్నమాచార్య

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ||

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ||

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ||

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ||
 

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy