నవీనము

18, ఫిబ్రవరి 2016, గురువారం

దయాగుణం గల దాత దగ్గరున్న సంపదంతా తరిగిపోయినా


చ. సరసదయాగుణంబుగలజాణ మహింగడు నొచ్చియుండియుం
దఱుచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకు లెట్లనం
జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయినమీఁదఁ బిప్పియై
ధరఁబడియున్నఁజేరవె ముదంబునఁజీమలు పెక్కు భాస్కరా.


భావం -

 చెఱుకు గానుగ యందు రసమంతా కారి పిప్పియై పడి ఉన్నా, చీమలెట్లా చేరుతాయో, అలాగే దయాగుణం గల దాత దగ్గరున్న సంపదంతా తరిగిపోయినా, లోకులు ఆయన వద్దకు ఏదో ఆశతో వస్తూనే ఉంటారు. అతను కూడా వారిని ఏదో విధంగా తృప్తి పరుస్తూనే ఉంటాడు. అది అతని సహజ లక్షణం.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy