-సీ.
ద నుజారి లీలావ తా రంబు లందలి; శౌర్యకర్మంబులు స ద్గుణములు
వి ని భక్తుఁ డగువాఁడు వే డ్కతోఁ బులకించి;
కన్నుల హర్షాశ్రు కణము లొలుక
గద్గదస్వరముతోఁ గమలాక్ష! వైకుంఠ!; వ రద! నారాయణ! వా సుదేవ!
యనుచు నొత్తిలిపాడు; నా డు; నాక్రోశించు; న గుఁ;
జింతనము జేయు; న తి యొనర్చు;
-తే.
మరులు కొని యుండుఁ; దనలోన మా టలాడు;
వే ల్పు సోఁకిన పురుషుని వృ త్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞాన ప టలిఁ గాల్చి; వి ష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వి వశుఁ డగుచు.

భావము:
భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనంద భాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి