నవీనము

23, జనవరి 2016, శనివారం

బలయుతుఁడైన వేళ




చ. బలయుతుఁడైన వేళ నిజబంధుఁడు తోడ్పడుఁగాని యాతఁడే
బలము తొలంగెనేని తనపాలిటిశత్రు వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁగాల్చుతఱి సఖ్యముఁ జూపును వాయుదే
వుఁడా, బలియుఁడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదె గాలి భాస్కరా.


భావం - తనకు అన్ని రకములైన బాలాలున్నప్పుడే బంధ్వులు సహాయం చేయడానికి ఇష్టపడతారు కానీ అవన్నీ కోల్పోయినప్పుడు కాదు. అడవిని అగ్ని కాల్చే సమయంలో వాయువు అతడికి సాయం చేస్తాడు, అదే అగ్ని చిన్నదీపం రూపంలో ఉన్న సమయంలో వాయువే అతడిని ఆర్పి వేస్తాడు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy