నవీనము

20, జనవరి 2016, బుధవారం

పాలకుడు/ యజమాని/ ప్రభువు మంచి వడు, గుణవంతుడైతే,



చ. ఫలమతి సూక్ష్మమైన నృపాలుఁడు మంచిగుణాఢ్యుఁడైనచో
నెలమి వివేకు లాతని కపేక్ష యొనర్తు ర దెట్లు చంద్రికా
విలసన మైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే
చలువగలట్టివాఁడగుటఁ జందురునెంతయుఁగోరి భాస్కరా.


భావం - పాలకుడు/ యజమాని/ ప్రభువు మంచి వడు, గుణవంతుడైతే, అతని వలన కొంచం లాభమే కలిగినా చాలని వివేకవంతులు ఆశపడతారు. దుష్టుడైతే అతడి నుంచి ఎంత లాభం కలిగుంతుందన్నా, సంతృప్తి చెందరు. వివేకవంతులు గుణాలకు/ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇస్తారు కానీ వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు. అది ఎలాగంటే చకోర పక్షులు తమ ఆకలి తీర్చుకొనుటకు ఎన్ని వస్తువులున్నా, వాటిని స్వీకరించక, చల్లని వాడైనా చంద్రుని కోసం ఎదురు చూసిన చంధంగా అన్నమాట

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy