నవీనము

26, జనవరి 2016, మంగళవారం

ఎంతటి వారికైనను భగవంతుని తోడు లేనిదే



ఎంతటి వారికైనను భగవంతుని తోడు లేనిదే జీవన యాత్ర సాగించుట దుర్లభము.అట్టి భగవంతుని కరుణ ప్రాప్తి కోసము ఆత్మను మనసు భగవంతుని కోసము నివేదించుకోవాలి. నిధి సుఖము కంటే రాముని సన్నిధి గొప్పదని చాటిన ఎందరో మహానుభావులు దైవ నిమఙ్ఞులై పరమార్ధ భావాన్ని పొంది ధన్యజీవులు అయ్యారు. దైవ సాన్నిధ్యము కోసము ఉత్తమ గ్రంథ పఠన సత్ప్రవర్తన అలవర్చుకోవాలి. దైవ చింతన కోసం రోజు ఒక విధిగా కొంత సమయమును వినియోగించుకోవాలి." అనగ అనగ రాగమతిశయించునట్లు నుండు" తినగ తినగ వేప తియ్యగుండును" అన్నట్లుగా సాధన చేయగా చేయగా అదే జీవన మార్గానికి సులువైన భగవత్ సన్నిధ్యం పొందగలరను కొనుటలో సందేహము లేదు. పరమ కిరాతకుడైన బోయవాడు రామ రామ అంటు జపించి, తరించి వాల్మీకి అయి పురుషొత్తముడైన శ్రీ రామ చరిత్రను రామాయణంగా రాసి ధన్య జీవి అయ్యడు. భగవత్ ప్రాప్తి కోసము దేవతార్చన చేసి తరిద్దాము.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy