నవీనము

31, జనవరి 2016, ఆదివారం

చిలిపో చిలిపి ..................



చిలిపో చిలిపి ..................

1.తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!

2.చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

3.రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి!

4.గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!

5.బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది!

6.ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొని

7.హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు! 8.ఓ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు కూడాను. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
జవాబు: అది తన ఇల్లే కాబట్టి!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy