నవీనము

30, జనవరి 2016, శనివారం

గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో -రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ||

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ||

జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ||

ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ||

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy