ధృతిస్తమ్భాధారాం దృఢగుణ-నిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస-సన్మార్గ ఘటితామ్
స్మరారే ! మ చ్చేతః-స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ ! శక్త్యా సహ శివ గణైః సేవిత విభో
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస-సన్మార్గ ఘటితామ్
స్మరారే ! మ చ్చేతః-స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ ! శక్త్యా సహ శివ గణైః సేవిత విభో
ఓ మన్మథవిజేతా! శివగణములచే సేవింపబడు ప్రభూ ! నా చిత్తము - ధైర్యమనే స్తంభములను ఆధారముగా కలిగినదియును, సుగుణములనే గట్టి త్రాళ్ళతో కట్టబడినదియును, చలించునదియును, విచిత్రమైనదియును, కమలములతో నిండినదియును, ప్రతిరోజూ సన్మార్గమునకు మళ్ళింపబడునదియునై యున్నది. నా చిత్తమనే యీ విశదమైన స్పష్టమైన పటకుటీరంలోనికి శక్తి తో సహా ప్రవేశించి, జయము నందుము స్వామీ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి