నవీనము
ఆర్యోక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆర్యోక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2016, బుధవారం

అప్పటివరకు తప్పు పట్టే హక్కు నీకు లేదు.



మనమొక తెలియని ప్రదేశానికి వచ్చామనుకుందాం. అక్కడ మన స్నేహితుని ఇంటి చిరునామా మన దగ్గర వుంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఆ ఊరివారిని ఒకరిని ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో అడుగుతాము. అతడు మనకు త్రోవ చెప్పాడనుకుందాం. అతడు నిజము చెప్పవచ్చు, లేక తప్పు చెప్పవచ్చు. కానీ ఆ ప్రయాణం సాగించనిదే ఆ చోటకు వెళ్ళనిదే అతడు సత్యం పలికాడా లేదా అన్నది రూడీ కాదు. ఆ అపరిచిత వ్యక్తి స్వభావం ఎలాంటిది , నమ్మదగినవాడా, కాదా, అతడికి నిజంగా తెలుసా లేదా అన్న మీమాంసలు పక్కన పెట్టి నువ్వు చేరవలసిన చోటు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తావు. తప్పు చోటుకు చేరితే అప్పుడు అతనిని తప్పు పట్టవచ్చు. కానీ అతడు చెప్పిన దారిలో పయనించెంత వరకు అతడు చెప్పిన దాని మీద నమ్మకంతో కదలాలి.
భగవంతుని చేరడానికి దారి చెప్పిన పురాణ ఋషులను విశ్వసించకుండా ఉండడానికి కారణం లేనప్పుడు వారి మాటలను పూర్తిగా విశ్వసించేందుకు సిద్ధపడాలి. వారి మాటలను అనుసరించి యత్నించి చివరకు ఆ మాటలు సత్యములు కాకపోతే అప్పుడు వారి యందు తప్పు చూపవచ్చును. అప్పటివరకు తప్పు పట్టే హక్కు నీకు లేదు.
--శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ మహాస్వామి వారు, శృంగేరి
!! ఓం నమో వేంకటేశాయ !!

వైరాగ్యం సంపాదించడం ఎలా?



వైరాగ్యం సంపాదించడం ఎలా?

ముముక్షువులందరికీ కావలసింది విరక్తి. దానిని సంపాదించాలి. కానీ, వైరాగ్యం కొరకు విషయవాంఛలతో మొండిగా యుద్ధం పనికి రాదు. వలలో చిక్కిన పక్షి తన్నుకొంటే ఆ వల ఇంకా బిగిసిపోతుంది. అలాగే విషయేచ్ఛ కూడా. కావున వాటిపై దృష్టి ఉంచకూడదు. ఇతర బాహ్య విషయాలు ఎలాగో అలాగే దుష్ట విషయాలు కూడా. 'ఇది కాదు' (నేతి) అనే స్మరణ వలనగానీ, విచార మార్గంలో ఇవి (ఆలోచనలు) ఎవరికి ఉదయిస్తున్నాయి' అనే విచారణ చేసి వాటిని నిర్మూలించు. వాటి కొమ్మలు, పిందెలు, పువ్వులు వాటంతట అవే పడిపోతాయి.

- భగవాన్ రమణ మహర్షి

21, జూన్ 2016, మంగళవారం

మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు



ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.

మన మనసు కూడా అంతే.

ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.

వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.

ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.

మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.

మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు....

20, జూన్ 2016, సోమవారం

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న: నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం లేని ఆత్మ ఎలా ఉంటుంది?



ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం లేని ఆత్మ ఎలా ఉంటుంది?

దానికి గురువుగారు అన్నారు,
పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి.
పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది.
కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.
తరువాత అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.
ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది.


మానవ శరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి.
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే
ఆత్మ పవిత్రత పొందుతుంది.

31, మార్చి 2016, గురువారం

స్ఫూర్తి



కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు..
ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు,
పారే నది..... వీచే గాలి.... ఊగే చెట్టు.... ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాదించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..
లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో,, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు, నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్, నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు

30, మార్చి 2016, బుధవారం

ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటిగదికి వెళ్ళారు.





గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు _/:\_యందు సేకరణ
ఒకరోజు భగవాన్ రమణమహర్షి తన ఆశ్రమంలోని వంటిగదికి వెళ్ళారు. అక్కడ నేలమీద బియ్యపుగింజలు పడి ఉండడం చూశారు. ఆయన వెంటనే కింద కూర్చుని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టారు. కాసేపటికి అక్కడికి ఆయన శిష్యులు వచ్చారు. తమ గురువుగారు నేలమీద కూర్చుని బియ్యం గింజలు ఏరుతుండడం చూసి విస్తుపోయారు. ఆత్మజ్ఞానం కోసం ఇంటినీ, తల్లినీ, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణమహర్షి ఇలా బియ్యపుగింజల్ని ఏరడం ఏమిటా అని వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఉండబట్టలేక వారు ఆయనవద్దకు వెళ్ళి "స్వామీ, నేలమీద పడిపోయిన కొన్ని బియ్యపుగింజలకి ఇంత ప్రాధాన్యమివ్వాలా? మన ఆశ్రమంలోబియ్యపు బస్తాలకు ఏ మాత్రం కొరత లేదు కదా?" అని ఆయనను మెల్లిగా అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి - "మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా చూడటం సరికాదు. వీటి లోపల ఏమేమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికీ అన్నదాత శ్రమ కనిపించడం లేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? హాయినిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేవీ చూడలేకపోతున్నందువల్లె మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినవన్నీ వీటిలో కనిపించి ఉంటే కిందపడిపోయిన ఈ బియ్యపుగింజల్ని ఏరాలా? అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపుగింజకూ భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి పరచిపోకండి. అందుకే అంటున్నా...మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి...ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృథా చేయకండి. నేలమీద పడిన బియ్యపు గింజలను భద్రపరచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి. అవి ఎంతో తృప్తిగా తింటాయి..." అని. ఆయన మాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు.

ఉత్తములకీ మనకీ తేడా !



ఉత్తములకీ మనకీ తేడా !
.
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
.
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
" మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
" కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.

29, మార్చి 2016, మంగళవారం

"మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా?



"మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా? అలాగే స్వార్ధ పరిత్యాగంచేతనే ఘనకార్యములు సాధించబడతాయి." --- Swami Raama Teertha

అది లాహోర్ విశ్వవిద్యాలయం, 1892 సంవత్సరంలో బి.ఏ. గణితశాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలిచ్చి ఏ తొమ్మిదింటికైనా జవాబులు వ్రాయమని అడిగారు. ఒక విద్యార్థి 13 ప్రశ్నలకూ జవాబువ్రాసి పై వాటిలో ఏ తొమ్మిదింటినైనా పరీక్షించుకోవచ్చునని అడుగున వ్రాశాడు. ఆ విద్యార్థికి విశ్వవిద్యాలయంలో ప్రధమస్థానం లభించింది!

అతడే స్వామి రామతీర్థయని పేరుగాంచిన తీర్థా రామగోస్వామి, అతడు 1873 అక్టోబర్ 23న పంజాబులో గుజరన్ వాలజిల్లా మురళీ వాలా గ్రామంలో జన్మించాడు. తండ్రి హీరా నందుడు పురోహితుడుగా జీవించేవాడు. పదవ యేటనే రామతీర్థకు వివాహమైనది. బిడ్డగూడ కలిగాడు. ఎం.ఏ చదివిన పిదప కొంతకాలం లాహోర్ క్రిష్టియన్ కాలేజిలో లెక్చరర్ గా పనిచేశాడు. పిదప సన్యాసం స్వీకరించి హిమాలయాలలో చాలాకాలం గడిపాడు.


ఒకనాడు ఆయనభార్య "నన్ను మీరు గుర్తుంచుకుంటారా !" అని అడిగింది.
అందుకు రాముడు, "ఉంచుకోను. ఎందుకు గుర్తుంచుకోవాలి? నాకు ముక్కున్నదని, చెవివుందని, కళ్ళువున్నవని గుర్తుంచుకుంటానా? అవినాలోని భాగాలే.. నీవు నేనే, మరెందుకు జ్య్నాపకముంచుకోవడం" అని నవ్వుతూ అన్నాడు. ఆదర్శదాంపత్యం ఎలాంటిదో ఈ మాటలలో ధ్వనిస్తున్నది. తానే భార్య: భార్యయే తానూ ఈ విధమగు భావన దంపతులలో వుండడం మన సంస్కృతియొక్క లక్షణం!

ఆయన హ్రుషికేశంలో వుండగా ఒకనాడు దగ్గర బంధువొకడు రొమ్ములు బాదుకుంటూ, శోకిస్తూ అక్కడికి వచ్చాడు. "ఏమిటి సంగతి! అని రాముడడిగాడు. ఇంటివద్ద రామతీర్థుని కుమారుడు మరణించాడని అతడు చెప్పాడు.
రాముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. :ఇదేమిటి ? గాలివీస్తున్నదనీ, చెట్లు పేరుగుతున్నవన్నీ, నీరు ప్రవిహిస్తున్నదనీ ఎడవడంలో ఎంత అర్డంలేదో, నీవా బాలుని మృతికి శోకించడంలోగూడా అంత అర్దంలేదు. మరణమనేది ప్రకృతిలో సహజమైనది. ఇందులో శోకింపతగిన దేమీ లేదు". ఎంతచక్కనిఉపమాన మిచ్చాడు!
 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy