నవీనము

22, ఫిబ్రవరి 2016, సోమవారం

మూసిన ముత్యాల కేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు-రచన: అన్నమాచార్య





రచన: అన్నమాచార్య

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ||

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ||


        

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy