సిరి వలెనేని సింహగుహచెంత వసించినఁజాలు సింహముల్
కరుల వధింపగా నచటఁగల్గును దంతచయంబుముత్యముల్
హరువుగ నక్కబొక్క కడనాశ్రయ మందిన నేమి గల్గెడుం
గొరిసెలుదూడతోఁకలును గొమ్మలు నెమ్ములుఁగాక భాస్కరా.
భావం -
ఎప్పుడూ కూడా గొప్పవారని ఆశ్రయిస్తేనే లాభం కానీ అల్పులను ఆశ్రయిస్తే ఏ లాభం లేదు. సింహం నివసించే గుహ దగ్గర ఉంటే ఏనుగు దంతాలు, బాటసారులను చంపినప్పుడు అక్కడ పడిన విలువైన వజ్రాలు, ముత్యాలు దొరుకుతాయేమో కానీ, నక్క బొరియ వద్దకు వెళ్ళి చూస్తే గిట్టలు, దూడతోకలు, ఏడ్ల ఎముకలు, కొమ్ములు తప్ప ఇంకేమీ దొరకవు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి