భాగవతము - పోతన - ఉషాపరిణయ వృత్తాంతము
ఈ బాణాసురునికి ఒక ముద్దుల కూతురున్నది. ఆమె పేరు ఉషాసుందరి. ఆమెకు ఒక రాత్రి స్వప్నములో ఒక యువకునుడు కనిపించగా అతనిని వరించి ప్రేమరోగియై కృశించిపోవుట గమనించి ఆ ఆమె చెలులు, చిత్రలేఖ ముల్లోకాలలో నుండు సుందర పురుషుల చిత్రములు గీసి చూపించుచు, శ్రీకృష్ణుని చిత్రము చూపుచు చెప్పుచున్నారు
కమనీయ శుభగాత్రు గంజాతదళనేత్రు, వసుధా కళత్రు బావనచరిత్రు
సత్యసంకల్పు, నిశాచరోగ్రవికల్పు నతపంనగాకల్పు నాగతల్సు
గౌస్తుభమణిభూషు గంభీరమ్రుదుభాషు శ్రితజనపోషు వంచితవిశేషు
నీలనీరదకాయు నిర్జితదైతేయు దృతపీతకౌశేయు నతివిధేయు
నఘమహాగదవైద్యు వేదాంతవేద్యు
దివ్యముని సన్నుతామోదు దీర్దపాదు
జిష్ణు వరసద్గుణాలంకరిష్ణు గృష్ణు
జూడు దైతేయకులబాల! శుభగలీల !
సత్యసంకల్పు, నిశాచరోగ్రవికల్పు నతపంనగాకల్పు నాగతల్సు
గౌస్తుభమణిభూషు గంభీరమ్రుదుభాషు శ్రితజనపోషు వంచితవిశేషు
నీలనీరదకాయు నిర్జితదైతేయు దృతపీతకౌశేయు నతివిధేయు
నఘమహాగదవైద్యు వేదాంతవేద్యు
దివ్యముని సన్నుతామోదు దీర్దపాదు
జిష్ణు వరసద్గుణాలంకరిష్ణు గృష్ణు
జూడు దైతేయకులబాల! శుభగలీల !
చూడండి శ్రీకృష్ణుని గుణగాణాలు మనకు వర్ణించి చెప్పుచూ ఎంతమంచి పద్యం చెప్పాడో పోతనార్యుడు. అతడు మనోహరమైన శుభలక్షణ శరీరము కలవాడు, పద్మదళములవంటి నేత్రములు కలవాడు, భూమిభర్త .పావన చరిత్రుడు, సత్యసంకల్పుడు, రాక్షసుల నణచువాడు, కాళీయుని దర్పమణచివాడు, శేషశయనుడు. కౌస్తుభమణి ధరించినవాడు, గంభీరుడు , మృదువుగా సంభాషించు వాడు, ఆశ్రితులను కాపాడువాడు, విశేష గుణముల నిధి, నీలమేఘము వంటి శరీరఛాయ కలవాడు, రాక్షసులను జయించు వాడు, పట్టు వస్త్రము ధరించువాడు, శరణుజొచ్చిన వారికి విధేయుడు, మహా పాపమనే రోగమును పోగొట్టు వైద్యుడు, వేదవేదాంతముల ద్వారా తెలియబడు వాడు, దేవతలచే మునులచే నుతింపబడువాడు, పాదజలలమే పుణ్యతిర్ధమైన వాడు, విజయశీలుడు, సద్గుణములే అలంకారముగా కలవాడు, నతడే శ్రీకృష్ణుడు. చూడుము దైత్యకుల సుందరీ ! ఇందులో దానవులను సంహరించువాడు,జయించు వాడు అనిచెప్పుచూ దైత్యకుల సుందరీ అని సంభోదించాడు. ఉన్నవిషయం దాపరికం లేకుండా చెప్పడం చెలుల ధర్మమని మరోమారు చెప్పుటయే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి