నవీనము

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా |రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా |

ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా | 
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ||

ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా |
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా ||

ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా |
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ||

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy