చ. సకలజనప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైనఁ దడ వుండదువేగమె పాసిపోవుఁగా
యకలుషమూర్తి యైనయమృతాంశుఁడు రాహువు తన్ను
మ్రింగినం డకటకమాని యుండఁడె దృఢస్థితి నెప్పటి యట్ల భాస్కరా.
భావం - జనులందరి యొక్క ఆదరానికి పాత్రుడైన పుణ్యాత్మునకు ఒకప్పుడు కీడు కలిగినా, అది చాలా కాలం ఉండదు. త్వరలోనే తొలగిపోతుంది. నిర్మలమైన కాంతి కలిగిన చంద్రుని రాహుగ్రహం మ్రింగినా, ధృడత్వాన్ని ప్రదర్శించి, త్వరలోనే ఎప్పటి వలే ప్రకాశిస్తున్నాడు కదా

కామెంట్‌ను పోస్ట్ చేయండి