నవీనము

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము- రచన: అన్నమాచార్య రాగం: మధ్యమావతి



రచన: అన్నమాచార్య

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ||

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ||

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ||
                                                                                                                                                                                                                                                                            

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy