నవీనము

20, జనవరి 2016, బుధవారం

దొందూ దొందే!!!


రైల్లో ప్రయాణిస్తున్న మాలోకానికి టాయిలెట్ అవసరం వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి టాయిలెట్ తలుపుపై ఉన్న అద్దం లో తన నీడ కనిపించింది. లోపల ఎవడో ఉన్నాడనుకొని మనవాడు కాసేపు ప్రక్కన నిలబడ్డాడు. కాసేపాగి వెళితే మళ్ళీ అదే నీడ! ఇలా గంటలో ఇరవై సార్లు తిరిగాక టీ.సి ని పిలిచి
"ఏమయ్యా గంట నుండి చూస్తున్నాను. టాయిలెట్ కు ఎప్పుడు వెళ్ళినా వాడు ఉంటున్నాడు . ఇలాగైతే మాగతేంటి? వెంటనే వాడిని బయటికి ఈడ్చిపారేయ్"అన్నాడు కోపంగా.
"చూద్దాం పదండి"అంటూ వచ్చిన టీసీ మాలోకానికి తగినవాడే. అద్దంలో తన బొమ్మ చూసుకొని వెనకడుగు వేశాడు. తర్వాత మాలోకం వైపు తిరిగి " సారీ సర్ నేనేం చేయలేను. లోపల ఉన్నది నాలాంటి రైల్వే అధికారి" అంటూ వెళ్ళిపోయాడు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy