- చ. మదిఁ దనునాసపడ్డయేడ మంచిగుణోన్నతుఁ డెట్టిహీనునిన్
వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా
త్రిదిశ విమానమధ్యమునఁ దెచ్చికృపామతి సారమేయమున్
మొదలనిడం డెధర్మజుఁడుమూఁగిసు రావళిచూడ భాస్కరా.
భావం - మంచిగుణాలు కలవాడు తనను ఆశ్రయించిన వాడు ఎంతటి నీచుడైనా, వాడిని
విడువడు సరికదా, సంతోష సమయంలో తనతో పాటు సకల సూఖాలు అనుభవింపజేస్తాడు.
పూర్వం గుణనిఢి అయిన ధర్మరాజు, తాను స్వర్గాన్ని వెళ్ళేందుకు విమానం ఎక్కే
సమయంలో తనను విడువక వెంట ప్రయాణించిన కుక్కను తన కంటే ముందు విమానం
ఎక్కించే తాను ఎక్కాడు కదా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి