చ. భుజబలశౌర్యవంతు లగుపుత్రులఁ గాంచినవారి కెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యముదీర్పఁడె తొల్లి భాస్కరా.
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యముదీర్పఁడె తొల్లి భాస్కరా.
భావం - బలపరాక్రమ సంపన్నులగు కొడుకులను కన్నవారికి ఏ కొరత ఉండదు. కుంతీదేవికి విజయుడనే బిరుదు కలిగిన అర్జునుడు వంటి కొడుకు ఉండడం చేతనే కదా, దేవలోకం నుంచి ఐరావతాన్ని సైతం తీసుకువచ్చి, వ్రతం పూర్తి చేసింది.
బలపరాక్రమాలు పెంపకం వలన వస్తాయి. పిల్లలని ధైర్యవంతులుగా, వీరులుగా, దేశభక్తులుగా, ధార్మిక నిష్ట కలవారిగా తీర్చి దిద్దవలసింది తల్లిదండ్రులే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి