నవీనము

20, జనవరి 2016, బుధవారం

ప్రపంచం లోనే అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏదీ?



ప్రపంచం లోనే అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏదీ?
ప్రపంచం లోనే అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏదీ? టీచర్..!? ప్రాణాలు నిలబెట్టే డాక్టర్? దేశాన్ని పాలించే ప్రధాని పదవి?? ఏదీ అన్నిటికన్నా గొప్ప జాబ్ అంటే మనదగ్గర చాలా ఆప్షన్లే ఉన్నాయి చెప్పటానికి కానీ… ప్రతీ మనిషికీ కావాల్సింది కడుపు నింపే గుప్పెడు మెతుకులు… ప్రాణాలు కాపాడే డాక్టర్ కైనా తన ప్రాణం నిలబెట్టుకోవటానికి కావాల్సింది అన్నమే కదా..!
ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్న నే మళ్ళీ వేసుకుంటే…..! అన్నిటికన్నా గొప్ప జాబ్ పంట పండించటం. మనిషి ప్రాథమికావసరాన్ని పూర్తి చేయటం కోసం భూమిలోని జీవాన్ని నోటికి అందించటం, వ్యవసాయం చేయటం అన్నిటికన్నా… అమ్మతో సమానమైన జాబ్, మనం మరిచిపోయిన ఒకేఒక్క జాబ్ “రైతు”. ఈ సారి మీరతన్ని మర్చిపోకండి… ఎందుకంటే అతన్ని మరిచిపోతే మన ప్రాణాలని మనమే మరిచిపోయినట్టు… మన అమ్మని మనమే మర్చిపోయినట్టు… మీ ఊరి పొలం గట్టున భుజాన నాగలి మోస్తూ వెళ్ళే అతన్నీ ఇంకోసారి ఏ చెట్టుకొమ్మకో నిర్జీవంగా వేళ్ళాడనివ్వకండి….

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy