ఉ. భ్రష్టున కర్థవంతు లగుబాంధవు లెందఱు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగ లేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చులక్ష్మి యా
జెష్ట క దేటికిం గలుగఁజేయదు తోడనె పుట్టి భాస్కరా.
భావం - అదృష్టహీనుడికి సంపన్నులైన బంధవులెంత మంది ఉన్నా, వారి సంపద ఇతనికి ఉపయోగపడదు. ఇతను ఉపయోగించుకోలేడు. అది అతడి కర్మ. అది ఎలాగంటే లోకులందరికి సంపదలు కలిగించే లక్ష్మీ దేవీ జ్యేష్ఠాదేవికి చెల్లలైనా, అందరికి సంపదలిచ్చి అనుగ్రహిస్తోంది కానీ, జ్యేష్ఠా దేవికి మాత్రం ఏమీ చేయలేకపోతున్నది.
దురదృష్టం, అదృష్టం అనేవి రెండు చేసిన పూర్వ పాపపుణ్య కర్మల వలన వస్తాయి. ఎవరి అదృష్టదురదృష్టాలకు వారే కారకులు. ఏ జన్మలో చేసిన మంచిపని అదృష్టంగా మారి రక్షించవచ్చు, చేసిన తప్పు దురదృష్టంగా వెంటాడవచ్చు

కామెంట్‌ను పోస్ట్ చేయండి