నవీనము

27, జనవరి 2016, బుధవారం

వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ ||రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ||

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ |
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ |

వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ |
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ||

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ |
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ |

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy