మాలావు పతివ్రత
ఓసారి ఓ ఆవిడ స్కూటర్ పార్క్ చేస్తూంటే ఓ కప్ప పక్క పార్క్ చేసిన స్కూటర్ టైర్ కింద నలిగిపోతూ కనపడింది. "అయ్యో" అని జాలిపడి దానిని తీసి బయట పడేసింది. ఆశ్చర్యంగా ఆ కప్ప "నువ్వు చేసిన ఈ ఉపకారానికి నీవు కోరిన మూడు కోరికలు తీరుస్తాను. కోరుకో" అంది. సరేనంది ఆవిడ. "అయితే ఓ దీనికో షరతు ఉంది. నువ్వు ఏం కోరుకుంటావో, మీ ఆయనకి పదిరెట్లు అదే వస్తుంది." అంది కప్ప. "ఓకే" అంది హుషారుగా ఆవిడ.
"నన్ను చాలా అందంగా చేసెయ్యి"
"జాగ్రత్త. మీ ఆయన నీ కంటే పదిరెట్లు అందంగా తయారవుతాడు. సమంతాలు, ఇలియానాలు, జెలినియాలు ఆయన చుట్టూ తిరుగుతారు" అంది కప్ప.
"ఏం పర్వాలేదు. మా ఆయన నన్నుతప్ప ఇంకెవ్వరిని చూడరు."
"ఐతే,చూస్కో,
అబ్రకదబ్ర , అబ్రకదబ్ర, అబ్రకదబ్ర, కప్ప మంత్రం వేసింది.
అంతా ఆవిడ కోరుకున్నట్లే జరిగింది.
"రెండోకోరికలో, నన్ను బాగా ధనవంతురాలిగా మార్చేయ్యి"
"షరతు తెలుసుగా, మీ ఆయన నీకంటే పదిరెట్లు........నసిగింది" కప్ప
"లుసు,లుసు, ఆయన డబ్బులన్నీ నావేగా! ముందు కోరికకి మంత్రం చదువు, మూడో మంత్రం కోరుకోవాలిగా"
అబ్రకదబ్ర , అబ్రకదబ్ర, అబ్రకదబ్ర, కప్ప మంత్రం వేసింది
మళ్ళీ, ఆవిడ కోరుకున్నట్లే జరిగింది.
మూడోకోరిక కోరుకోనా? అందావిడ
కోరుకో, నాకు పన్లున్నాయి. చెరువులోకి వెళ్ళాలి. అంది కప్ప
"నాకు చాలా తక్కువ అంటే మైల్డ్ హార్ట్ ఎటాక్ తెప్పిచు." మంత్రం వేసింది కప్ప
వాళ్ళాయన పెద్ద హార్ట్ ఎటాక్ వచ్చి పోయాడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి