నవీనము

7, జనవరి 2016, గురువారం

ఏ దురలవాట్లు లేనివాడు ఎలా ఉంటాడో







ఒక సారి ఓ పెద్ద మనిషి రోడ్డు పక్కన నిలబడి టాక్సీ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక యాచకుడు ఆయన దగ్గరకొచ్చి “బాబూ ధర్మం సేయండి బాబూ!” చెయ్యి చాపాడు.
ఆ పెద్ద మనిషి పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే వృత్తి ధర్మం కదా! భిక్షగాడు మాత్రం వదలకుండా విసిగిస్తూనే ఉన్నాడు.
దాంతో ఆ పెద్ద మనిషి ఇంక వీడికి ఏదో కొంత ఇస్తే గానీ వెళ్ళేటట్లు లేడే అనుకుని “సరే నేను డబ్బులిస్తాగానీ! ఆ డబ్బుతో నువ్వు ఏమి చేస్తావు?” అని అడిగాడు.
“గుక్కెడు టీ నీళ్ళు తాగుతానయ్యా”
“మరి నా దగ్గర టీ లేదు గానీ సిగరెట్ ఉంది కాలుస్తావా? అడిగాడు”
“సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదయ్యా. నేను తాగను”
సర్లే అని తన బ్యాగు లోనుంచి విస్కీ బాటిల్ తీసి “ఇదిగో దీన్ని గానీ ఒక్క గుటకేశావంటే స్వర్గానికి అడుగు దూరంలో ఉంటావంతే. తీసుకో పండగ చేసుకో!”
“క్షమించండి బాబూ! ఆల్కహాలు తాగితే లివరు చెడిపోతుంది. నేను తాగనయ్యా”
” సరే ఏం చేద్దాం. ఇంకో అవకాశం ఉంది. నేనిప్పుడు గుర్రప్పందాల దగ్గరికి వెళుతున్నా? నాతోపాటు రా. నేను టికెట్టు కొంటాను. ఒకవేళ మనం పందెం గెలిస్తే ఆ డబ్బంతా నీకే ఇచ్చేస్తా.”
“గుర్రప్పందాలాడటం ఒక వ్యసనం లాంటిది. నేను దాని దగ్గరకు కూడా పోను”
“అయితే ఒక పని చేయవయ్యా నాతోపాటు మా ఇంటికి రా!”
ఆ భిక్షగాది ముఖం ఆనందంతో వెలిగిపోయింది చివరకు ఏదో ఒకటి దక్కుతుందనే ఆశతో అయినా సరే ఏదో చిన్న సందేహం
“ఎందుకు బాబయ్యా?”
“ఏం లేదయ్యా చాలా రోజుల నుంచీ నా భార్యలే
ఏ దురలవాట్లు లేనివాడు ఎలా ఉంటాడో చూడాలని తెగ ముచ్చట పడిపోతుంది. అందుకని

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy