నవీనము

4, జనవరి 2016, సోమవారం

దానము చేయనివారు


దానము చేయనేరనియధార్మికు సంపద యుండియుండియున్‌
దానె పలాయనంబగుట తథ్యము బూరుగుమాను గాచినన్‌
దానిఫలంబు లూరక వృథా పడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక యభోజ్యము లౌట భాస్కరా. 
భావం - 
బూరుగ చెట్లకు ఎన్నో కాయలు కాస్తాయి. చూడ్డానికి రమణీయంగా కనిపిస్తాయి. కానీ అవి తినదగినవి కాదు కనుక ఎవరూ కోయక ఊరికినే రాలిపోతాయి తప్ప ఎవరికి ఉపయోగపడవు. అదే విధంగా దానధర్మాలు చేయని వాడి సంపదలు ఎవరికీ ఉపయోగపడక నశించిపోతాయి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy