నవీనము

7, జనవరి 2016, గురువారం

అపశబ్ధములతో గూడి యున్నను హరిచరిత్ర, వాని గుణములు, గానము సర్వ పాపములను హరించును.-భాగవతము -- పోతన


అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా
పపరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచుం, బాడుచున్
జపముల్ చేయుచు, వీనులన్ వినుచు, నశ్రాంతంబు గీర్తింపుచున్
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వ్యజ్న చింతింపుమా ! 
 భావం-
అపశబ్ధములతో గూడి యున్నను హరిచరిత్ర, వాని గుణములు, గానము సర్వ పాపములను హరించును. అట్టి హరిని, కీర్తించుచు, జపించుచు ,గానము చేయుచు, ఆ నామ శ్రవణము చేయుచు తాపసులు, సాధువులు ధన్యులగుచున్నారు. ఈ విషయమై బాగా ఆలోచింపుము అని వ్యాసునికి నారదుడు చెప్పుచున్నాడు.. మనం గూడా అలోచించాలి. కొందరు ఉచ్చారణ దోషం ఉంటె మంత్రం పనికి రాదని చెప్పడం ఉంది కాని అపశబ్దం అడ్డుకాదని మోక్షమునకు అవాంతరం కాదని గ్రహించాలి.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy