నవీనము

4, జనవరి 2016, సోమవారం

రైతు- విలేఖరి



ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు.

విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?


వి : నల్లమేకకు..
రై : గడ్డి..

వి : మరి తెల్లమేకకు..?
రై : గడ్డి..

వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?

వి : నల్లమేకను..
రై : బయటి వసారాలో..!!

వి : మరి తెల్లమేకను..?
రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!

వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?

వి : నల్లమేకకు..
రై : నీటితో..

వి : మరి తెల్లమేకకు..?
రై : దానికి కూడా నీటితో..!!

వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,
తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది.

వి: మరి తెల్లమేక..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రై : అదికూడా నాదే..!!
.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.

రైతు నవ్వుతూ అన్నాడు..

ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా
ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?
 

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy